11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

కన్ను మూసిన నిఘా నేత్రాలు

01-07-2025 12:00 AM

 - సీసీ కెమెరాలు 24/7 పెట్రోల్ లింక్ చేసే శక్తి

- సీసీ కెమెరాలతో నిఘా ఉండాలంటున్న ప్రజలు

చిన్నచింతకుంట, జూన్ ౩౦ : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు పెట్టు తమ కళ్ళ ఎదుట చీమ చుట్టుకుమన్న పసిగట్టే శక్తి వాటికి సొంతం పోలీసు పెట్రోలింగ్ చేసిన చేయకపోయినా అవి మాత్రం 24/7 పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి అలాంటి సీసీ కెమెరాల నిర్వాహనపై పోలీసు అధికారులు అశ్రద్ధ వహించకపోవడంతో గ్రామా లలో చిన్నాచితక దొంగతనాలు పెరిగిపోతున్నాయి. మండలంలోని గ్రామాలలో ప్రధా న కూడలిలో చాలా చోట్ల దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ప్రధానంగా పోలీసుల ప్రోద్బలంతో మండలంలోని ఆయా షాపులో యజమానులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రా మాలలోని ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన సిసి కెమారాల వ్వవస్థ ప్రస్తుతం పూర్తిగా మూలన పడింది గ్రామాల్లో సమస్యత్మక ప్రాంతాలలో జరిగే అల్లర్లు ను అరికట్టేందు కు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి.

కానీ పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజాప్రతినిధు లు, కొందరు దాతలు చేసిన సహకారమంతా బూడిదలోపోసిన పన్నీరైంది. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం అన్న సూక్తిని పలు సందర్భాల్లో పోలీస్ అధికారులు చెప్పినా ఆచరణలో విఫలమైంది. దీంతో నిఘా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.ఇప్పటికైనా పో లీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు తో పర్యవేక్షణ చేసి గస్తీ నిర్వహించి దొంగల బెడద నుంచి కాపడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

-దాతలు ముందుకు రావాలి...

మండల కేంద్రంలో సీసీ నిఘా ఉండాలంటే విద్యార్థులు కూడా ముందుకు రావల సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్వాణ పో లీస్ అధికారులు చేసినప్పటికీ వాటి ఏర్పా టు, మరమ్మత్తులు చేయించేందుకు దాతల ముందుకు వస్తే మరింత వేగంగా వివిధ స దుపాయాలు ప్రజల కు అందుబాటులో ఉండనున్నాయి. సిసి నిఘా ఉంటే ఇప్పుడు ఏమి జరిగినా వెంటనే తెలుసుకునేందుకు ఇ టు పోలీస్ అధికారులకు.. ఆటో ప్రజలకు ఎంతో మేలు జరగనున్నది. దాతలు ముం దుకు వచ్చేలా పోలీస్ అధికారులు కూడా కృషి చేయవలసిన అవసరం ఎంతైనాఉంది.