calender_icon.png 1 July, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నిరసనను భగ్నం చేసిన పోలీసులు

01-07-2025 12:00:00 AM

- సీతారామ ప్రాజెక్టు వద్ద దిష్టిబొమ్మ దగ్ధం, ముఖ్యమంత్రికి పిండ ప్రదానం అడ్డుకున్న పోలీసులు 

- జిల్లా అధ్యక్షునితో పాటు, పలువురు ఎమ్మెల్యేలు అరెస్ట్ 

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 30 (విజయ క్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తలపె ట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భ గ్నం చేశారు. మా నీళ్లు మాకే కావాలి అనే ని నాదంతో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండలం పూసగూ డెం వద్ద గల సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.

జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, వన మా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు వైరా నియోజకవర్గం నుంచి నాయకుల పాల్గొన్నారు. పోలీసులు పథకం ప్రకారమే పాల్వంచ పట్టణ పరిధిలోని కుం టి నాగుల గూడెం వద్ద బిఆర్‌ఎస్ నాయకులను కార్యకర్తలను అడ్డుకొని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా కొంత ఉద్రుక్తత చోటుచేసుకుంది. రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వ రరావు, హరిప్రియ నాయక్, దిండిగల రా జేందర్, రాకేష్ రెడ్డి లను అరెస్ట్ చేసి పా ల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో కార్యకర్తలు అభిమానులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అనంతరం వ్యక్తిగత పుచికత్ విడుదల చేశారు.