calender_icon.png 1 July, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల హామీలను నెరవేర్చండి

01-07-2025 12:00:00 AM

కొత్తకోట జూన్ 30 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ కోరుతూ కొత్తకోటలో బీజేపీ నాయకులు చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వడ్లకు క్వింటాలుకు 500 బోనస్ అదనంగా ఇస్తామని చెప్పి గద్దెనెక్కి 18 నెలలు అవుతున్న హామీని నెరవేర్చలేదని అన్నారు. తక్షణమే వడ్లకు 500 రూపాయల బోనసివ్వలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు ఒకేసారి చేస్తానని భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నెలలు అవుతున్న రుణమాఫీ విషయం మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఈ రెండు తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.