తెలుగు నేటివిటీకి దగ్గరగా
17-12-2024 12:00 AM
హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రీమారన్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ వేదాక్షర మూవీస్ నిర్మాత చింతపల్లి రామారావు ఈ చిత్రం తెలుగు హక్కులను దక్కించుకు న్నారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి, మంజు వారియర్, మూవీ యూనిట్ పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. హైదరాబాద్‌లో విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడుతూ.. “విడుదల-2’ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుంది” అన్నారు. ‘ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనది’ అని కథానాయకి మంజు వారియర్ చెప్పారు. నిర్మాత రామారావు మాట్లాడుతూ ‘ఇది తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న సినిమా’ అని తెలిపారు.






