పెళ్లినాటి ప్రమాణాలు మరిచిన వ్యక్తి కథ
కేవీ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జమున జంటగా వచ్చిన చిత్రం ‘పెళ్లినాటి ప్రమాణాలు’. ఈ సినిమా 1958 డిసెంబర్ 17న విడుదలైంది. ఎస్వీ రంగారావు, రాజ సులోచన కీలక పాత్రలు పోషించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణారావు (నాగేశ్వరరావు) బాబాయి సలహాల రావు (రమణారెడ్డి) సిఫార్సుతో భీమసేనరావు (ఎస్వీ రంగారావు) ఇంటి కి వెళతాడు. ఉత్తరం తారుమారవడంతో కృష్ణారావుని ఇంట్లో వం టవాడుగా భావిస్తారు. నిజం తెలిపేందుకు భీమసేనారావు ఇంటికి సలహాలరావు వెళతాడు. అక్కడ ఆయన కూతురు రుక్మిణి (జమున)ను చూసి కృష్ణారావుకి ఇచ్చి వివాహం చేయమని కోరుతాడు. అయితే తొలు త దీనికి భీమసేనారావు అంగీకరించడు. కొడుకు ప్రతాప్ భీమసేనారావుకు నచ్చజెప్పడంతో కృష్ణారావు, రుక్మిణిల వివాహం జరుగుతుంది. పెళ్లి నాడు దంపతులిద్దరూ అనేక ప్రమాణాలు చేస్తారు. కాలక్రమంలో ముగ్గురు పిల్లలు కలిగాక, రుక్మిణి ఇంటి పనులకే పరిమితమవడంతో విసుగు చెందిన కృష్ణారావు పెళ్లినాటి ప్రమాణాలన్నీ మరచి సెక్రటరీ రాధ (రాజ సులోచన)కు దగ్గరవుతాడు. ఇది తెలుసుకున్న సలహాలరావు ఏం చేశాడు? చివరికి వాళ్లిద్దరి సంసారం చక్కదిద్దారా? లేదా? అనే అంశాలతో ఈ కథను అద్భుతంగా కేవీ రెడ్డి తెరకెక్కించారు.






