7 April, 2026 | 5:02 AM

వ్యాపార సంస్థల బంద్

14-05-2024 02:08 AM

మేడ్చల్, మే 13 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. ఇందుకోసం సొం తూళ్లలో ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు ఓటు హక్కు వేసుకునేందుకు ప్రతి ప్రభు త్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు పరిశ్రమలు, హోటళ్లకు సెలవులు ప్రకటిం చిన విషయం తెలిసిందే. ఈ క్రమం లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజక వర్గాల పరిధిలోని వ్యాపార సంస్థ లు, పరిశ్రమలు, హోటళ్లు, కార్యాలయాలు సోమవారం స్వచ్ఛందంగా మూతపడ్డాయి. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రధాన రోడ్లు, కాలనీ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దీంతో పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కొన్ని తెరుచుకున్నాయి.