calender_icon.png 8 November, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 08:41:55 PM

చిన్నచింతకుంట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ నాయ‌కుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి దగ్గర జ‌రిపిన సంబ‌రాల్లో  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయ‌కులు, కార్యకర్తలు, అభిమానుల‌తో క‌లిసి కేక క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా దేవరకద్ర మాజీ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ... నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్నిఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్తించారు.