08-11-2025 08:43:59 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ 57వ డివిజన్ పరిధిలోని అశోక్ కాలనీలో నూతనంగా ఏర్పడుతున్న వైన్ షాప్ ను పెట్టకూడదని, అశోకకాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు. దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చింత శ్రీనివాస్, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మంద కృష్ణరెడ్డిలు మాట్లాడుతూ అశోక కాలనీ అంటే ఆదర్శవంతమైన కాలనీ అని వైన్ షాప్ ఉండకూడదని ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అని అన్నారు. ఎన్జీవోస్ కాలనీ మెయిన్ రోడ్డు చాలా రద్దీ ప్రాంతమని ఇక్కడ వైన్ షాప్ పెడితే ట్రాఫిక్ రీత్యా ఇబ్బందులు జరుగుతాయని తెలిపారు.
చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు ఇబ్బందులు కలుగుతాయని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఉన్నారని ఇక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల ఇబ్బంది పడతారని, వారు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అశోక కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి బూర రాంచందర్, ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి భగవాన్ రెడ్డి, మల్లేశం, దేవాలయ కమిటీ కార్యదర్శి సరోత్తంరెడ్డి, కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.