అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
21-06-2024 11:23 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు అసెంబ్లీ మెట్లకు మొక్కి శాసనసభలో అడుగుపెట్టారు. ఆయనకు మంత్రలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్.. ఆ తర్వాత తిరిగి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు.






