కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బెయిల్ పై స్టే
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది వాదించడంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో కేజ్రీవాల్ బెయిల్ పై స్టే ఇవ్వాలని ఈడీ అధికారులు హైకోర్టును కోరారు. ట్రయల్ కోర్టు ఇచ్చి బెయిల్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వకూడదని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. మద్యం కేసులో కేజ్రీవాల్ కు గురువారం సాయంత్రం రెగ్యులర్ బెయిల్ వచ్చింది.






