బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి..?
21-06-2024 11:05 AM
హైదరాబాద్: శాసనసభ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వెళ్లారు. పోచారంతో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ వైపు మెగ్గు చూపుతున్న ఎమ్మెల్యేలను సీఎం పార్టీలోకి ఆహ్వానించే అవకాశముంది. ఇప్పటికే బీఆర్ఎస్ చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.






