16 August, 2026 | 7:54 AM

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురు మావోయిస్టులు మృతి

17-06-2024 02:04 PM

సింగ్‌భూమ్ : జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళ సహా మరో నలుగురు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటన టోన్టో, గోయిల్‌కెరా ప్రాంతంలో జరిగినట్లు వెల్లడించారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్  మీడియాకు తెలిపారు. ఘటనాస్థలంలో పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.