ఆదాయం పెంచుతాం.. పెంచిన ఆదాయం పంచుతాం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అందరూ సమిష్టిగా కలిసి పనిచేద్దాం. సంపద సృష్టిస్తాం.. ఆదాయం పెంచుతాం.. పెంచిన ఆదాయం పంచుతాం అని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం అన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడిందన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని తెలిపారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలనేదే తన ఆలోచన అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెన్షన్ లు ప్రారంభించింది అన్న ఎన్టీఆర్ అని సీఎం స్పష్టం చేశారు. నాడు రూ.35 పెన్షన్ ఇచ్చారు. తరువాత 1995లో రూ.75 చేసాం. 2014లో రూ.200 ఉన్న పెన్షన్ ని వెంటనే రూ.1000 పెంచి, మళ్ళీ మరొక రూ.1000 పెంచి రూ.2000 పెంచాం. మళ్ళీ ఇప్పుడు రాగానే రూ.3 వేల పెన్షన్ ని, వెయ్యి పెంచి రూ.4 వేలు చేసామని చంద్రబాబు తెలిపారు.






