ఏపీలో పెంచిన పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
01-07-2024 11:11 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ మొదలైన నైపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ అందించారు. సీఎం చేతుల మీదుగా పాముల నాయక్ కుటుంబం పింఛన్ అందుకుంది. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందచేశారు. నాయక్ కుటుంబం తమకు ఇల్లు కావాలని సీఎంను కోరారు. ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలపటమే కాక, అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం సీఎం అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు.






