17-12-2024 12:04:50 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16(విజయక్రాంతి) : క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా క్రీడాపాలసీని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని జింఖానా గ్రౌండ్‌లో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను శివసేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివసేన మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని చెప్పారు. క్రీడాభివృద్ధికి రూ.320కోట్లను కేటాయించిందని చెప్పారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా 16 మండలాలకు చెందిన సుమారు 1700 మంది క్రీడాకారులు 20క్రీడాంశాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, హైదరాబాద్ స్పోర్ట్స్ అధికారి సుధాకర్, సెక్రటరీ శ్రీదేవి, ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేష్‌గౌడ్, ఎస్‌ఏటీజీ కోచ్‌లు, పీఈటీ, పీడీలు తదితరులు పాల్గొన్నారు.