calender_icon.png 12 November, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లేఆఫ్స్‌కు దబంగ్ ఢిల్లీ

17-12-2024 12:01:55 AM

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో దబంగ్ ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం బెంగాల్ వారియర్స్‌పై విజయంతో ఢిల్లీ రెండో జట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 47 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ తరఫున ఆశూ మాలిక్ (17 పాయింట్లు) తన ప్రదర్శనతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున విశ్వాస్ 8 పాయింట్లు సాధించాడు. ఇప్పటికే హర్యానా స్టీలర్స్ తొలి జట్టుగా ప్లేఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 37 పునేరి పల్టన్‌పై విజయాన్ని అందుకుంది. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్ (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరవగా.. అయాన్ 9 పాయింట్లు సాధించాడు. అభినేశ్ పునేరి పల్టన్‌కు 7 పాయింట్లు అందించాడు. నేటి మ్యాచ్‌ల్లో హర్యానాతో యూపీ యోధాస్, జైపూర్‌తో బెంగళూరు తలపడనున్నాయి.