calender_icon.png 12 November, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో విజయంపై కన్ను

17-12-2024 12:08:31 AM

*  నేడు వెస్టిండీస్‌తో రెండో టీ20

*  రాత్రి 7 గంటల నుంచి

ముంబై: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత అమ్మాయిల జట్టు నేడు ముంబై వేదికగా రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో విజయం సాధించిన హర్మన్ సేన ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును ప్రదర్శించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధానతో పాటు జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. కెప్టెన్ హర్మన్ ప్రీత్ బ్యాట్ ఝులిపించాల్సిన అవసరముంది. అయితే ఫీల్డింగ్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా తొలి టీ20లో మన ఫీల్డర్లు చాలా క్యాచ్‌లు జారవిడిచారు. రెండో టీ20లో మాత్రం ఫీల్డింగ్‌లో తప్పిదాలు లేకుండా చూసుకోవాలి. విండీస్ బ్యాటింగ్‌లో డియాండ్రా దొతిన్ మరోసారి కీలకం కానుండగా.. బౌలింగ్‌లో కరీష్మా ఆకట్టుకుంటోంది.