calender_icon.png 10 January, 2026 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం మహా జాతరను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి

09-01-2026 12:00:00 AM

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్

ములుగు, జనవరి 8 (విజయక్రాంతి): శ్రీసమ్మక్క సారలమ్మ మహా జాతర ను జోనల్, సెక్టార్స్ అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలో భాగంగా మేడారం జాతరలో విధులు నిర్వహించనున్న జోనల్, సెక్టార్స్ అధికారులకు గురువారం మేడారం హరిత హోటల్ లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావుతో కలసి శిక్షణ ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు.