29-07-2025 02:37:03 AM
మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): కమ్మ సామాజికవర్గానికి తెలంగాణలో టీడీపీలోనూ దక్కని ప్రాధాన్యత బీఆర్‌ఎస్‌లో దక్కిందని, సీఎం రమేశ్ కమ్మ సామాజికవర్గంలో, కులాల మధ్య తగవులు పెట్టేందుకు యత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మండిపడ్డారు. సీఎం రమేశ్ కాంట్రాక్టుల కోసం ఎంతకైనా దిగజారుతారని ఆయన ఆరోపించారు.
కేటీఆర్‌ది తనది సొంత సామాజికవర్గమని చెప్పి పనులు చేయించుకోలేదా అని భాస్కర్‌రావు ప్రశ్నించారు. సోమవారం హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భాస్కర్‌రావు మాట్లాడుతూ కేటీఆర్ కమ్మ సామాజికవర్గం గురించి ఏదో అన్నారని సీఎం రమేశ్ ఇప్పు డు మాట్లాడుతున్నారని, కేటీఆర్ ఏదైనా అంటే కమ్మ నాయకులకు ఆయన అప్పుడే ఎందుకు చెప్పలేదని భాస్కర్‌రావు ప్రశ్నించారు.
కమ్మలకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్య త ఇచ్చారని, పువ్వాడ, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చారని, నామాకు పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం ఇచ్చారన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీఆర్‌ఎస్‌లో కమ్మలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారన్నారు. బీజేపీతో మాట్లాడాలనుకుంటే కేసీఆర్ నేరుగా ఆ పార్టీతోనే మాట్లా డుతారని, మధ్యలో సీఎం రమేశ్ ఎవరని ప్రశ్నించారు.