calender_icon.png 29 July, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లకు 9.16 కోట్లు విడుదల

29-07-2025 02:36:56 AM

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ గదుల నిర్మాణానికి సంబంధించి నిధులను విద్యాశాఖ విడుదల చేసింది. రూ.9.16 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని 32 జిల్లాలకు ఈ నిధులను మంజూరు చేసింది. కంప్యూటర్ ల్యాబ్‌లకు రూ.3.13 కోట్లు, లైబ్రరీ రూమ్‌లకు రూ.3.42 కోట్లు, సైన్స్ ల్యాబ్‌ల కోసం రూ.2.61 కోట్లు కేటాయించారు. ఫేజ్‌ణె భాగంగా సివిల్ వర్క్స్‌కు సంబంధించి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.