13 March, 2026 | 5:59 AM

ఫుడ్ పాయిజనింగ్‌పై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

29-07-2025 02:38 AM

నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగర్‌కర్నూల్ గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన- మీడియా ద్వారా వెలుగులోకి రాగా హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ సంబంధిత అధికారులను ఆగస్టు 28 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.