calender_icon.png 11 November, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ చేరుకున్న సీఎం

12-09-2024 12:57:47 AM

  1. నేడు సోనియాగాంధీ, మల్లిఖార్జునఖర్గేతో భేటీ

క్యాబినెట్ విస్తరణ, పార్టీ నిర్మాణంపై చర్చ!

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఆయన హడావుడిగా బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవహారాలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

చాలారోజుల నుంచి క్యాబినెట్ విస్తరణపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. పైగా మంత్రివర్గ విస్తరణ జరక్కపోవడంతో సీఎం వద్ద పేరుకు పోయిన శాఖలపై సరిగా పర్యవేక్షణ ఉండటం లేదు. దీనితో ఇటు అధికారయంత్రాంగంలోనూ, అటు ఆయా శాఖల్లోని సిబ్బం దిలోనూ కాస్త అలసత్వం కనపడుతోంది. పూర్తిస్థాయి మంత్రి వచ్చిన తరువాత చూసుకుందామనే ధోరణి ఆయా శాఖల ఉన్నతాధికారుల్లో కనపడుతోంది.

ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరికి బెర్తులు ఇవ్వాలనేదానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనితోపాటు పార్టీకి నూత న పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించిన నేపథ్యం లో రాష్ట్ర కార్యవర్గాన్నికూడా నిర్ణయించాల్సి ఉంది. దీనిపైకూడా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి నిర్దిష్టమైన సూచన లు అందే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనితోపాటు మిగిలిపోయిన ఒకట్రెండు కార్పొరేషన్ల చైర్మన్లపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ, హోం శాఖా మంత్రి అమిత్‌షాల అపాయింటుమెంట్ కోసం కూడా అధికారులు ప్రయ త్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బుధవారం రాత్రి వరకుకూడా వారి అపాయింట్‌మెంట్‌పై ఎలాంటి సమాచారం అందలేదు. ఒక వేళ గురువారం అపాయింట్‌మెంట్ దొరికితే శుక్రవారం వరకు కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉండే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ లభి స్తే.. వరద నష్టంపై విన్నవించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వరద ప్రాం తాల్లో ఏరియల్ సర్వే చేసి వెళ్లి ఒక నివేదిక ను అమిత్‌షాకు అందించారని సమాచారం.

కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆ నివేదికకూడా వచ్చిన తరువాత రాష్ట్రానికి అందిం చే సహాయం విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరద నష్టంపై వివరించి.. కాస్త ఉదారంగా సహాయం అందించాలని సీఎం రేవంత్ విన్నవించే అవకాశం ఉంది. ప్రధాని అపాయింట్‌మెంట్ లభిస్తే.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, ప్రాజెక్టులు, ఆర్థిక సాయం పై విన్నవించే అవకాశం ఉందని సమాచా రం. వీరిద్దరి అపాయింట్‌మెంట్ లభించకపోతే.. గురువారం రాత్రికే ఆయన హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తుంది.