12-09-2024 05:30:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళాన్ని అందజేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిశారు. అనంతరం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలంగాణకు సాయం అందించడంపై పవన్ కల్యాణ్‌ను సీఎం అభినందించారు. అలాగే, ఏపీలో వరద సహాయక చర్యల గురించి ఏపీ డిప్యూటీ సీఎంను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.