నాగిరెడ్డిపేటలో అధికారులకు సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
02-03-2026 04:32 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన జగ్గీ సౌమ్యకు సోమవారం గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు సహకారంతో నిరుపేదలకు వైద్యసహాయం కొరకు సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేయడం జరిగిందనన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాలాజీ, వాడు మెంబర్లు శ్రీకాంత్,బలరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమాన్లు, సాయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు




