calender_icon.png 6 August, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయ నిధి పేదలకు వరం

30-11-2024 08:32:10 PM

లబ్ధిదారులకు రూ. 6.50 లక్షల చెక్కులు పంపిణీ..

ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్ లోని గాంధీనగర్ డివిజన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ 14 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా లబ్ధిదారులకు రూ. 6.50 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎం రాకేష్ కుమార్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, సురేందర్, ఎన్ డి. సాయికుమార్, శ్యాంసుందర్ చిట్టి మాధవ్, శ్రీనివాస్ గుప్తా, వల్లాల రవి యాదవ్, రాజేష్, కిరణ్ కుమార్, టిల్లు, బాసం శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.