30-11-2024 08:39:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో 100% పన్నులను వసూలు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పన్నుల వసూళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పటివరకు వసూలైన పనులు అడిగి తెలుసుకున్న ఆయన మార్చి 31 వరకు 100% పనులను వసూలు చేయాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీలో ప్రభుత్వం ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని పారిశుద్ధతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది ఉన్నారు.