గ్రామీణ ప్రాంతాల నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడల్లో ఎదగాలి
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి...
మసాయి పేట్: గ్రామీణ ప్రాంతాల నుండి ప్రపంచ స్థాయి వరకు విద్యార్థులు క్రీడల్లో ఎదగాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగిందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాలలో సీఎం కప్ క్రీడలను మండల ప్రత్యేక అధికారి రాకేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ తర్వాత కొత్తగా ఏర్పడిన మాసాయిపేట మండలం, ఎన్నో వ్యయ ప్రయాసలకు తట్టుకొని సాధించుకున్న మండలం అని అలాంటి మండలం అన్ని రంగాలలో రాణించి జిల్లాలో ఉత్తమ మండలంగా మాసాయిపేట ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
మాసాయిపేట మండలానికి ఎల్లవేళల సాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే పాఠశాలల అభివృద్ధి కోసం దాతలు వారి వారి స్థాయిని బట్టి అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించాల్సిన అవసరం పాఠశాల పిటి ఉపాధ్యాయులపైన ఉందని అలాంటి వారిని ప్రోత్సహించి రాష్ట్రస్థాయిలో రాణించే విధంగా ప్రోత్సాహం అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట తహసిల్దార్ జ్ఞాన జ్యోతి, మాసాయిపేట ఎంఈఓ లీలావతి, వెల్దుర్తి ఎంఈఓ యాదగిరి, ఎంపీడీవో ఉమాదేవి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాసాయిపేట మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, నాయకులు శేఖర్ గౌడ్, కిష్టా గౌడ్, దుర్గ గౌడ్, జీతయ్య కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






