calender_icon.png 14 January, 2026 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు

14-01-2026 10:32:34 AM

హైదరాబాద్: భోగి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సంతోషంగా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవాలని సీఎం సూచించారు. పల్లెల్లో ప్రతీ ఇంట భోగి మంటల వెలుగులు భోగభాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిసూ.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.