14 April, 2026 | 5:19 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

14-01-2026 10:52 AM

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో మూడు రోజులపాటు సంక్రాంతి వైభవం కొనసాగుతుందన్నారు. ​ఈ సందర్భంగా పల్లెలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో నిండి ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని కేసీఆర్(KCR) పేర్కొన్నారు.

సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా సంతోషాలు వెల్లివిరుస్తాయని  తెలిపారు. దక్షిణం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి పర్వదినం, హిందూ శాస్త్ర పురాణాల్లో ప్రత్యేకతను సంతరించుకుందని స్పష్టం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వ్యవసాయాభివృద్ధిని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతాంగ సంక్షేమం తిరిగి గాడినపడి, తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని మాజీ ఆకాంక్షించారు.