14-01-2026 02:44:52 AM
ఇందిరా పార్కు రాక్ గార్డెన్స్‌లో ఘనంగా మర్రి చెన్నారెడ్డి జయంతి
హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ముషీరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆనాడే పునాదులు చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. మాజీ ముఖ్య మంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్ గా స్వర్గీయ మర్ని చెన్నారెడ్డి పేద ప్రజల సంక్షేమమే తన వంతు కృషి చేశారని వారు పేర్కొన్నారు. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత పాటుపడాలని వారు పిలుపునిచ్చారు.
స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి 107 జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఇందిరాపార్కు లోని చెన్నారెడ్డి రాక్ గార్డెన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, తెలంగాణ బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్, మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణమోహన్ రావు, తెలంగాణ పంచాయితీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి, చెన్నారెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఆయన పెద్ద కుమారుడు మర్రి రవీందర్ రెడ్డి, మనుమలు ఆదిత్యారెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్ జి. రచన శ్రీ వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, చెన్నారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1969 తెలంగా ణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చెన్నారెడ్డి గొప్ప పరిపాలన దక్షుడని, ఆయన ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. చెన్నారెడ్డి కృషి, దృడ సంకల్పం స్ఫూర్తి దాయకమని ఆయన ప్రస్తానం తెలుగు రాష్ట్రాల రాజకీయ సామాజకి విషయాల్లో తరతరాలకు ప్రేరణగా నిలుస్తుం దని అన్నారు. చెన్నా రెడ్డి ఆశయ సాధనకు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు యువత పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మీ, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రీయా నవీన్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు జి. వెంకటేష్, పరిమల్ కుమార్, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుండగొని భరత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ రాం, బీజేపీ నగర నాయకుల ఎంసీ మహేందర్ బాబు, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు సలంద్రి దిలీప్ యాదవ్, అప్పా కో- ఆర్డినేటర్ బొట్టు రమేష్, సక్యులు వసుధ, సుదర్శన్ రెడ్డి, హేమ మాలిని జ్యోతిలావణ్య, రాజేశ్వరి, శోభారాణి పాల్గొన్నారు.