calender_icon.png 15 August, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వావలంబన దిశగా భారత్

15-08-2025 01:34:14 AM

  1. పహల్గాం ఉగ్రదాడిని భారత్ ముక్తకంఠంతో ఖండించింది

ఆపరేషన్ సిందూర్‌తో మన బలగాల సత్తా ప్రపంచానికి తెలిసింది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వావలంబన దేశంగా అవతరించే దిశగా భారత్ ధృడమైన విశ్వాసంతో అడుగులు వేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్ధేశించి ప్రసంగించారు. ‘అందరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతం త్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఈ రెండు రోజులు మనం భరతమాత ముద్దుబిడ్డలం అనే విషయాన్ని గుర్తు చేస్తాయి. మనం స్వాతంత్య్రం పొందిన తర్వాత ప్రతి వయోజనుడు ఓటు హక్కును వినియోగించుకునేలా మనం ప్రజాస్వామ్యంలో ముందుకు సాగాం. మన రాజ్యాం గం, మన ప్రజాస్వామ్యం అన్నింటికంటే గొప్పవి. దేశ విభజన కలిగించిన బాధను మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. విభజన సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది.

లక్షల మంది ఇండ్లు లేకుండా నిరాశ్రయులయ్యారు. బలవంతంగా ఇతర ప్రదేశా లకు పంపబడ్డారు. ఆనాటి బాధితులకు మనం ఈ రోజు నివాళులు అర్పించాం. మన రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలను కలిగి ఉంది. అవి న్యా యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ అన్నింటిలో మానవ గౌరవం ప్రధానమని నేను నమ్ముతాను. మానవులందరూ సమానమే. ప్రతి ఒక్కరు ఆరోగ్య రక్షణ, విద్యలో సమాన అవకాశాలు ఉండాలి.

ఈ విధమైన సూత్రాలతోనే మనం 1947లో కొత్త ప్రయాణం మొదలుపెట్టాం. ప్రస్తుతం దేశం వేగంగా పట్టణీకరణ చెందుతోంది. నగరాల్లో వసతులు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. పట్టణాల్లో రవాణా సౌకర్యాల కోసం ప్రభు త్వం మెట్రో రైల్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. మెట్రో రైల్ నెట్‌వర్క్ ఉన్న నగరాల జాబితా దశాబ్ద కాలంలో రెట్టింపయింది.

అటల్ మిషన్, అమృత్ పథకాలు ఎక్కువ గృహాలు సురక్షిత నల్లా నీటిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. దేశంలోని నేతన్నలు వారి ఉత్ప త్తుల గౌరవార్థంగా ఆగస్టు 7న జాతీయ చేనే త దినోత్సవం జరుపుకున్నాం. 1905నాటి స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా 2015 నుంచి చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వదేశీ ఉత్పత్తులనే వాడమనే స్వదేశీ ఉద్య మ చొరవ చాలా గొప్పది.

మేకిన్ ఇండి యా, ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ పథకాల రూపకల్పనకు స్వదేశీ ఉద్యమమే స్ఫూ ర్తి. భారతీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయమని ఇవి పేర్కొంటున్నాయి. శుభాన్షు శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లడం ఎంతో మంది భారతీయులు ఈ రంగం వైపు మళ్లేలా చేసింది. యువతరం గొప్ప కళలు కనేందుకు ఈ యాత్ర ఎంతో ఉపయోగపడింది. మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ కు శుభాంశు యాత్ర ఎంతో ఉపయోగపడుతోంది.

వివిధ రంగాలతో పాటు క్రీడల్లో కూడా భారత యువ క్రీడాకారులు మునుపెన్నడూ లేని విధంగా విజ యాలతో మనల్ని తలెత్తుకునేలా చేశారు. మన దేశాన్ని గ్లోబల్ స్పోర్టింగ్ పవర్ హౌస్‌గా రూపుదిద్దేందుకు ‘నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ఎంతో తోడ్పడుతోంది. ఈ సంవత్సరం జరిగిన పహల్గాం ఉగ్రదాడిని దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇండియా ఉగ్రమూలకు సరైన జవాబిచ్చింది.

దేశాన్ని కాపాడే విషయంలో మన సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉంటాయని ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం విజయానికి నిదర్శనంగా నిలిచింది. టెర్రరిజంపై మానవాళి పోరాటంలో ఆపరేషన్ సిందూర్ ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను.

గత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటుతో.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ అనేది ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది. భారత్ 2047 వరకు గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపొందాలని కోరుకుంటున్నాం. అందుకు అవసరం అయిన ప్రణాళికలు రచించాం. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి. ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.

సామాజిక సంక్షేమంతో కూడిన సమగ్ర ఆర్థిక వృద్ధి.. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్‌ను ముందుకు నడుపుతోంది. మన ఆడబిడ్డలే మనకు గర్వకారణం. ప్రతి రంగంలో వారు అడ్డుగోడలు తొలగించుకుంటూ ముందుకు పయనిస్తున్నారు. ముఖ్యంగా మన సరిహద్దులను కాపాడుతున్న సైనికులు, పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు నా మనసులోనే ఉంటారు. భారతీయులకు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి వ్యక్తులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.