1 August, 2026 | 5:32 PM

42% రిజర్వేషన్లపై సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారు

03-09-2025 12:20 AM

కుభీర్, సెప్టెంబర్ 2: మండల కేంద్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు  కల్పించినందుకు మాజీ శాసనసభ్యులు జీ.విట్టల్ రెడ్డి ఆదేశానుసారం  కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం  పెద్ద సంఖ్యలో హాజరై పటాకాలు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు కల్పించి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాన్, మాజీ జెడ్పిటిసి శంకర్ చౌహాన్, మాజీ ఏఎంసీ చైర్మన్ కందూరి సంతోష్, ఏఎంసీ వైస్ చైర్మన్ హైమద్, నాగలింగం, సుది రాజన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.