అభివృద్ధి కోసమే.. తెలంగాణ రైజింగ్ 2047
న్యూడిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో(Public Affairs Forum of India Annual Conference) సీఎం పాల్గొన్నారు. 'విజన్ తెలంగాణ.. రైజింగ్' అంశంపై సదస్సులో 500 మంది ప్రతినిధులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను సీఎం వివరించారు. తెలంగాణ సుస్థిరాభివృద్ధికి ప్రైవేట్ రంగం మద్దతు గురించి తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ఆదాయ మార్గాలను వివరించారు. ఆర్ఆర్ఆర్ వెలుపల రూరల్ తెలంగాణ(Rural Telangana) ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రూరల్ తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ అరికట్టడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నారని సూచించారు. 2034 కల్లా ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది తమ లక్ష్యమని సీఎం తెలిపారు. దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచి రావాలనేది ప్రభుత్వం లక్ష్యమన్నారు.




