20-09-2025 12:36:35 AM
ఇంఫాల్, సెప్టెంబర్ 19: మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ వస్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన భద్రతా దళాల వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం కాల్పులు జరిపారు. ఈ దాడి సమ యంలో వాహనంలో 33 మంది సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెం దగా.. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు.
ఈ దాడి హేయమైన చర్యగా మణి పూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా అభివర్ణించారు. దాడిని ఖండిస్తూ ఎక్స్‌లో మృ తుల కుంటుంబాలకు సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం బీరేన్ సిం గ్ కూడా జవాన్లపై దాడిని ఖండించాడు.