calender_icon.png 19 September, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం

19-09-2025 12:08:26 PM

న్యూఢిల్లీ: పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో(Public Affairs Forum of India Annual Conference) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 'భారత్-ప్రచంచం.. సహకారం, అనుసంధానం, పోటీతత్వం' పేరుతో సదస్సు నిర్వహించారు. సదస్సులో 500 మంది ప్రతినిధులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047(Telangana Rising 2047) రూపొందించుకున్నామని తెలిపారు. తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం అని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరధిలో కోటిమంది నివసిస్తున్నారని సీఎం సూచించారు. కొత్తగా ఆర్ఆర్ఆర్(RRR) కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 70 కిలో మీటర్ ఉన్న మెట్రో లైన్లను(Hyderabad Metro lines) 150 కిలో మీటర్లకు విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

హైదరాబాద్ మెట్రోలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వచ్చే పదేళ్లలో దీన్ని 15 లక్షలకు పెంచాలనేదే తమ లక్ష్యమన్నారు.  గుజరాత్ లోని సబర్మతి తీరం తరహాలో మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా(Net Zero City Hyderabad) మార్చడమే లక్ష్యం అన్నారు. కాలుష్య నివారణకు పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో తయారీ పరిశ్రమలను చైనా ప్లస్ వన్ గా(China Plus One) మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీని(Future City) నిర్మించబోతున్నామని తెలిపారు. విమానాశ్రయ నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరుతున్నామని సీఎం పేర్కొన్నారు.