21-09-2025 11:58:17 AM
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే అతి గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజుల పాటు ఆట పాటలతో వైభవంగా సాగే బతుకమ్మ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గౌరమ్మ తల్లిని ప్రార్థించారు.