21-09-2025 12:57:23 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చీరస్మర నియమని కామారెడ్డి పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఆస్తులను కూడా లేక చేయకుండా ఉద్యమాలకు ఖర్చు పెట్టారన్నారు. తెలంగాణ వాదాన్ని నినాధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మనకు కావాల్సిన నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ పోరాటం చేశారన్నారు. ఎన్నో ఉన్నత పదవులు ఇస్తామన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నీ లెక్కచేయకుండా పదవులు ముఖ్యం కాదని తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి వివరిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పదవులను తిరస్కరించిన గొప్ప మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.