calender_icon.png 21 September, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

21-09-2025 12:53:04 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం పరామర్శించారు. కొత్తపేట గ్రామానికి చెందిన జాలిగపు కొమురయ్య, చిట్యాల మండల కేంద్రానికి చెందిన పెరుమాండ్ల కృష్ణ, అందుకుతండా గ్రామానికి చెందిన దాసారపు రాజయ్య, నైన్ పాక గ్రామానికి చెందిన వావిళ్ళ రాములు, మండ రాజక్క, భిక్కనూరి లచ్చక్క వివిధ కారణాలతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి,చిట్యాల టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య,మాజీ ఎంపీటీసీ దబ్బేట అనిల్,చిలుకల రాయకొమురు,గంగాధరి రవీందర్,నక్క భాస్కర్ తదితరులు ఉన్నారు.