calender_icon.png 21 September, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి,బతుకమ్మ ఉత్సవాలు

21-09-2025 01:01:36 PM

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో గల శ్రీ రైసింగ్ కిడ్స్  స్కూల్లో ఘనంగా నవరాత్రి బతుకమ్మ ఉత్సవాలు శనివారం సాయంత్రం నిర్వహించారు ,ఈ కార్యక్రమం లో చిన్నారులు చేసిన బస్మాసుర, నృత్య ప్రదర్శన, ఎల్లమ్మ, బతుకమ్మ, పాటల పైన చేసిన ఆటపాటలు  చూపరులను, ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీమణి అరుణ, శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ హైమావతి, ప్రిన్సిపల్ స్వాతి యాదవ్, టీచర్స్, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.