calender_icon.png 21 September, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటం మహేష్ కు సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

21-09-2025 01:15:30 PM

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ యువజన నాయకుడు కాటం మహేష్ కు ఆదివారం సంతాపం తెలిపిన ఎమ్మెల్యే. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కాటo మహేష్ ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలు వేసి సంతాపం తెలియజేసిన నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం.  అనంతరం వారి చిన్న పిల్లలను కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

పిల్లల చదువుల విషయం పట్ల భవిష్యత్తులో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కాటo వెంకటేశం, జిల్లా డిసిసి కార్యదర్శి శశి పాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ, గ్రామ శాఖ అధ్యక్షుడు నీలకంఠ లింగస్వామి, అద్దెల లింగారెడ్డి, పొట్లపల్లి రవి, తెలుసూరి సైదులు, ఏర్పుల నరసింహ, సాగర్ల నాగరాజు, గంట పుల్లారెడ్డి, యాదయ్య, కాటo గణేష్, మల్లేష్, పొట్లపల్లి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.