calender_icon.png 21 September, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచే అమలులోకి నూతన జీఎస్టీ శ్లాబ్ రేట్లు

21-09-2025 11:51:02 AM

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ దాదాపు 375 వస్తువులపై తగ్గిన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.  వంటగదిలోని ప్రధాన వస్తువుల నుండి ఎలక్ట్రానిక్స్ వరకు, మందులు, పరికరాల నుండి ఆటోమొబైల్స్ వరకు ధరలు తగ్గుతాయి. వినియోగదారులకు వరంలా, కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, నవరాత్రి మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుండి వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. నెయ్యి, పనీర్, వెన్న, 'నామ్‌కీన్', కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీములు వంటి సామూహిక వినియోగ వస్తువులు, టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్లు వంటి ఆకాంక్షాత్మక వస్తువులు చౌకగా మారనున్నాయి. 

జీఎస్టీ హేతుబద్ధీకరణ దృష్ట్యా వివిధ ఎఫ్‌ఎంసిజి కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. చాలా మందులు మరియు ఫార్ములేషన్లపై జీఎస్టీ, గ్లూకోమీటర్లు మరియు డయాగోనిస్టిక్ కిట్‌లు వంటి వైద్య పరికరాలపై 5 శాతానికి తగ్గించడంతో, సామాన్యులకు మందుల ధర తగ్గుతుంది. అలాగే, సిమెంట్‌పై జీఎస్టీ 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో గృహనిర్మాణదారులు ప్రయోజనం పొందుతారు. ఇకపై జీఎస్టీలో ఉన్న 12,28 శ్లాబ్ లు తొలగించి 5,18 శాతం శ్లాబ్ లు మాత్రమే కొనసాగనున్నాయి. విలాస వస్తువులపై 40 శాతం పన్ను విధించాలని కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకుంది.