21-09-2025 12:27:31 PM
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్ పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... బాధితురాలు కేఏ పాల్ కంపెనీలో నైట్ షిప్టులో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. అన్ని వివరాలతో బాధితురాలు షిటీమ్స్ ను ఆశ్రయించారు. వారి వాట్సాప్ మెసేజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకొని, బాధితురాలి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు.