7 April, 2026 | 3:38 PM

కేసీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

17-02-2026 10:43 AM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను  ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎంతో పాటు పలువురు నేతలు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.