calender_icon.png 17 February, 2026 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్లలో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక పర్యటన

17-02-2026 10:12:36 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని పలు డివిజన్లలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy) ఆకస్మిక పర్యటన చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్(Nalgonda Municipal Corporation) నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే మంత్రి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.

నల్గొండ ప్రకాశం బజార్(Nalgonda Prakasam Bazaar)లో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించారు. ఫుట్ పాత్ పై చిరు వ్యాపారులను పాత కలెక్టరేట్ స్థలంలోకి తరలిస్తామని మంత్రి తెలిపారు. వీధి వ్యాపారులకు స్థలం కేటాయించి వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటి రెడ్డి(Minister Komatireddy) పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.