25-12-2025 10:18:13 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి వైద్యం నిమిత్తం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దేవాడ సోండో సమీపంలోని బ్రిడ్జి పైనుండి వారు ప్రయాణిస్తున్న కారు కింద పడగా ముగ్గురు మహిళలు ఒక బాలిక ప్రమాద స్థలంలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన వారు కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మహిళలు అని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న జాకీర్ యొక్క భార్య,సల్మా బేగం, కూతురు శబ్రీమ్, వార్డ్ 14, నంబర్ వార్డుకు చెందిన వారి బంధువులు ఇద్దరు మహిళలు ఆఫ్జా బేగం, సహార కూడా మృతి చెందినట్లు జాకీర్ తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చంద్రపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.