25-12-2025 10:21:04 AM
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన కావలి అనిల్ కుమార్ (25) అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మొన్న జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సాయికుమార్ అలియాస్ సాయులు అనే వ్యక్తి బిజెపి పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. అందులో ఆయన ఓడిపోయాడు ఈ విషయంపై ఆయన అనిల్ కుమార్ కి నాకు ఓటు వేయలేదని మందలించడంతో మనస్థాపానికి గురైన కావలి అనిల్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయంపై మృతుడి అక్క తెలిపిన వివరాల ప్రకారం.... అనిల్ కుమార్ మరియు అనిల్ కుమార్ కుటుంబం మనకు ఓటు వేయలేదని వాడిని ఎప్పటికైనా చంపాలని మాట్లాడుకున్నట్టు ఆ విషయం సాయి కుమార్ విన్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నన్ను ఎప్పటికైనా చంపేస్తారని మనస్తాపం చెంది ఈరోజు ఉదయం ఊరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం గమనించిన తన తల్లి వెంటనే చుట్టుపక్కల వాళ్ళకి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన చేరుకున్న ఓట్ల పోలీసులు ప్రాణం ఉన్నదేమో అని నిపంతో శంకర్ పల్లి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు అక్కడ పరీక్షించిన డాక్టర్లు మృతి చెందినట్లు తెలపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.