ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం
13-12-2024 10:23 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పార్లమెంటులో కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 1.15 గం.కు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులను సీఎం చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనతో కేబినెట్‌లో బెర్త్, నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పర్యటనలో అధిష్ఠాన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర సీనియర్ నేతలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.






