24-01-2026 11:46:53 AM
జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు
హైదరాబాద్: జాతీయ బాలికా దినోత్సవం(National Girl Child Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికల సాధికారతే ప్రగతిశీలమైన, సమగ్ర తెలంగాణ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు కీలకమని సీఎం పేర్కొన్నారు. ప్రతి బాలికకు నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యం, సమాన అవకాశాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో నాయకత్వం వహించే అవకాశాలు కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా, ప్రతి బాలిక తన సంపూర్ణ సామర్థ్యాన్ని సాకారం చేసుకొని రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో అర్థవంతమైన పాత్ర పోషించే భవిష్యత్తు దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు.