24-01-2026 11:24:19 AM
వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు
నల్లమలలో కలకలం
అచ్చంపేట: నల్లమల్లలోని వేరువేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. తమవారిని తీసుకెళ్ళింది పోలీసుల మరి ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రతినిధులా తెలియక వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు స్థానికుల వివరాల ప్రకారం..
నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool district) అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందింది రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహ కార్యదర్శి జక్క బాలయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు అంబయ్య, లింగాల మండలం రాయవరం చెందిన రైతు యాదయ్యను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమతో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబయ్యను అచ్చంపేట పట్టణంలో అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకోగా, రాత్రి రెండు గంటల సమయంలో జక్క బాలయ్య ఇంటికి వచ్చి తలుపు తట్టి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. తీసుకువచ్చారు.
అర్ధరాత్రి సమయంలో కొంతమంది వచ్చి.. తాము ఉడిమిళ్ళ గ్రామం నుంచి వచ్చామని చెబుతూ తలుపు తట్టారని.. ఆ తర్వాత తన భర్త బాలయ్య తలుపు తీయగా ఆయనతో మాట్లాడుతుండగా తాను నిద్ర లేచానని భార్య లింగమ్మ తెలిపింది. తన భర్తను గుర్తు తెలియని అధికారులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. వచ్చిన వారు సివిల్ డ్రెస్ లో ఉండటంతో పోలీసులా లేక కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధుల తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే యాదయ్యను సాహితం ఇదేవిధంగా తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ వారు ఎక్కడున్నారు తెలియజేయాలని బయట కుటుంబ సభ్యులు కోరుతున్నారు.