24-01-2026 11:26:35 AM
బిబిపెట్, జనవరి 24(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిబిపెట్ మండలం మందాపూర్ గ్రామానికి సమీపంగా ఉన్న గాజు బాయి వద్ద శనివారం బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి పడి ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడిని దోమకొండ మండల కేంద్రానికి చెందిన గోసానిపల్లి మహేష్ (27)గా గుర్తించారు. మహేష్ తన అమ్మమ్మ వాళ్ళు నివాసం ఉన్న మందాపూర్ గ్రామానికి వెళ్లి తిరిగు ప్రయాణం లో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న బిబిపెట్ ఎస్‌ఐ విజయ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.